ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు గచ్చిబౌలిలోని మైహోం భుజాలో పోసాని ఇంటికి వెళ్లి అప్పటికప్పుడే నోటీసులిచ్చి అరెస్ట్ చేశారు. ఇటీవల పోసాని కృష్ణమురళి రాజకీయాలకు స్వస్తి పలికారు. ఇకపై ఏ రాజకీయ పార్టీలో కొనసాగనని, వీటన్నింటికీ దూరంగా ఉంటానని ప్రకటించారు. కాగా వైసీపీ హయాంలో పోసాని ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్ పదవి చేపట్టారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీ నేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వారు. అసభ్య పదజాలంతో దూషించేవారు. దీంతో పోసానిపై సీబీఐ కేసుతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, పోసానికి ఆరోగ్యం బాగా లేదని, చెప్పినా వినకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన భార్య ఆరోపిస్తున్నారు.