వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు షాకిచ్చారు.ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గత వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. గత రెండు నెలలుగా రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విపరీతంగా జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పేర్ని నాని అధికార దుర్వినియోగంతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.