ప్రముఖ డైరెక్టర్ రాం గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందించారు. ఇటీవల ఏపీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ వ్యూహం అనే సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ , మంత్రి లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఓ టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేసి , హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. అమరావతి లోని తుళ్లూరులో ఆర్జీవీపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆర్జీవీ సోషల్ మీడియాలో పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు నోటీసులు అందించి ఆర్జీవీని విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.