Site icon

సోష‌ల్ మీడియా ట్రోల‌ర్స్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి

సోష‌ల్ మీడియా ట్రోల‌ర్స్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసి వేధించార‌ని ఆయ‌న చెప్పారు. అసెంబ్లీలో జీరో అవ‌ర్‌లో ఆయ‌న మాట్లాడారు. అసెంబ్లీ వేదిక‌గా భవాని అప్పట్లో మాట్లాడిన మాట‌ల‌ను ట్రోల్‌ చేశారని, గత స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో దిశ చట్టం పేరిట జరిగిన దుర్వినియోగంపై విచారణ జరిపించాలని వాసు కోరారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి శిక్ష పడేలా చట్టాలను సవరించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.

Share
Exit mobile version