Site icon

వైసీపీ విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఖ‌రారు!

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు వైసీపీ స‌మాయ‌త్తం అవుతోంది. ఈ మేర‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్ర‌క‌టించారు. సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని అభ్య‌ర్థిగా ఖ‌రారు చేశారు. నేడు విజయనగరంలో నిర్వ‌హించిన‌ జిల్లా నేతల సమావేశంలో వైయ‌స్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన అప్పలనాయుడు ఇప్ప‌టికే నాలుగు సార్లు బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ఈ నెల 28న విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

Share
Exit mobile version