సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టినట్లే ఇటీవల భరత మాతకు మహా హారతి పేరుతో ట్యాంక్‌బండ్‌లో ఓ క్యార్యక్రమం నిర్వహించి ఇద్దరి మృతికి కారణమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేసు పెట్టాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జాడ్సన్ డిమాండ్ చేశారు. ఇద్దరి మృతికి కారణమైన కిషన్ రెడ్డి మీద సీవీ ఆనంద్ ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రవ్నించారు. కిషన్ రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారన్నారు. 83 కేసులున్న క్రిమినల్ రేవంత్ రెడ్డి సీఎంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.