మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్ల కూల్చివేతను బీజేపీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర ప్రారంభించనుంది. నేడు, రేపు బీజేపీ నేతలు అక్కడే బస చేయనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి..! అనే నినాదంతో మూసీ పరివాహక ప్రాంతంలో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమాన్ని చేయనుంది. మూసీ ప్రక్షాళన – సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి, మూసీ సుందరీకరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉందని భరోసా కల్పించేందుకే మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.