హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆరు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. తక్షణమే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే మంగళవారం దేశంలోని పలు కంపెనీలకు చెందిన వందకు పైగా విమానాలకు బాంబాబెదిరింపులు వచ్చాయి. గత పది రోజులుగా వందల సంఖ్యలో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశంలో వరుస బాంబు బెదిరింపులకు గోండియాకు చెందిన జగదీశ్ ఉయికే అని పోలీసులు గుర్తించారు. ఆయన ఒక రచయిత. గతంలో ఉగ్రవాదంపై పుస్తకం రచించారు. 2021లో సైతం జగదీశ్ ఓ కేసులో అరెస్టయ్యారు.