దేశంలో విమానాలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ , బెంగళూర్, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లోని విమానశ్రయాల్లో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా, శంషాబాద్ విమానాశ్రయంలో మరో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. కోయంబత్తూరు టూ చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్‌లో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. ఆరు గంటలు చెక్ చేసిన తర్వాత అనుమానాస్పద వస్తువులు ఏమీ లేవని నిర్ధారించారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.