టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ చైర్మన్ ఎవరిని వరిస్తుందా అని సర్వత్రా చర్చ సాగింది. అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారంటూ గుసగుసలు వినిపించాయి. అయితే తదనంతరం సీఎం చంద్రబాబు ఆయన సన్నిహితుడు బీఆర్ నాయుడుకు ఆ పదవిని కట్టబెట్టారు. బీఆర్ నాయుడుతో పాటు, 16 మంది పాలక మండలి సభ్యులతో టీటీడీ ఈవో శ్యామలరావు ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బీఆర్ నాయుడు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.