తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయం బయటకు రావడంతో కేసీఆర్ ఆరోగ్యం పరిస్థితిపై పలువురు ఆందోళన చెందారు. కాగా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వచ్చారని పార్టీ నేతలు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తన ఇంటికి వెళ్లనున్నారు. కేసీఆర్ బుధవారం పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకోవడం, నేడు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకోవడంతో కేసీఆర్ ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారా అనే చర్చ నడుస్తోంది. అలాగే దాదాపు ఏడు నెలల తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వచ్చి నిన్న అక్కడ నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.