Site icon

బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేడు అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క‌క్షపూరిత రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్‌ కొనుగోళ్ల పేరుతో కేసీఆర్‌పై, ఫార్ములా-ఈ, ఇంట్లో ఫంక్షన్‌, ఫాం హౌస్‌, లగచర్ల విషయంలో కేటీఆర్‌ను ఇబ్బందుల‌కు గురి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అక్ర‌మ కేసులు బ‌నాయించి కేటీఆర్ ను జైలులో వేయాల‌ని కాంగ్రెస్ పాల‌కులు ప‌థ‌కాలు రూపొందిస్తున్నార‌ని ఆరోపించారు.

Share
Exit mobile version