తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆటోలోనే వచ్చారు. ఇక్కడ కేటీఆర్ స్వయంగా ఆటో నడపడం విశేషం. మంగళవారం నల్ల చొక్కాలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నేడు ఖాకీ చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని, రాష్ట్రంలో ఇప్పటికే 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.