బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయని, బీఆర్ఎస్ సైనికులు సిద్దంగా ఉండాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులకు రక్షణ కల్పించడం అసాధ్యమన్నారు. కాగా, నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ విచారించిన కోర్టు ఈ విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.