Site icon

మూసీ ప్ర‌క్షాళ‌న‌కు బీజేపీ వ్య‌తిరేకం కాదు

మూసీ ప్ర‌క్షాళ‌న‌కు బీజేపీ వ్య‌తిరేకం కాద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించారు. మూసీ న‌దిలో డ్రైనేజీ నీళ్లు క‌ల‌వ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాల‌ని కోరారు.మ‌రో వైపు రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు పోరాటం చేస్తున్నా ప్ర‌భుత్వం మొండిగా ముందుకు వెళ్ల‌డం స‌రికాద‌న్నారు. అభ్య‌ర్థుల‌ న్యాయమైన సమస్యల‌ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Share
Exit mobile version