హైదరాబాద్‌లో హోలీ వేడుకలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, అవినాశ్ మహంతీ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు జరుపుకోవద్దని చెప్పారు. ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడదని పేర్కొన్నారు. బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని సూచించారు. మార్చి 14వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాంసం షాపులు, మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.