వైయస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో ఇటీవల పెట్రోల్ దాడికి గురై మృతి చెందిన బాలిక కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. ఈ రోజు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు బాధిత కుంటుంబానికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత నగదు చెక్కును బాలిక తల్లిదండ్రులకు అందజేశారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, అదైర్య పడవద్దని బాలిక తల్లికి చెప్పారు. ప్రభుత్వం బాలిక సోదరుడి చదువు బాధ్యతలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆమె తల్లికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.