ఏపీ సీఎం చంద్రబాబు జనాభాపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా తగ్గిపోతుందని, ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మందికి జన్మనివ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో జనాభా తగ్గే పరిస్థితి వస్తుందని, 2035 నాటికి జనాభా బాగా తగ్గిపోతుందని అన్నారు. ఊర్లల్లో పిల్లలు ఉండరని, అందరూ ముసలి వాళ్లే ఉంటారన్నారు. అందరూ చనిపోతే ఊరల్లో ఎవరూ ఉండరని, తర్వాత ఊర్లే ఉండవని అన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో ముప్పాడ గ్రామం ఉండాలంటే జనాభా పెంచాలని చెప్పారు.