ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. కానీ ఈ పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ బయల్దేరనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. మంత్రి నారా లోకేశ్ సైతం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు.