ఏలూరు జిల్లాలో ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఉచిత ఇసుక అంటూ ప్రభుత్వం తమను రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు శ్రీనివాసపురం రోడ్ బైపాస్ వద్ద ధర్నా చేపట్టారు. తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. డ్రైవర్ల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, పోలీసులు భారీగా మోహరించి డ్రైవర్లను అక్కడి నుంచి తరలిస్తున్నారు.