తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ , అలియాస్ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకే ఓట్లు వేయండని ఓటర్లకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా రెడ్ల ఓట్లు మాకు వద్దంటూ క్లారిటీ ఇచ్చారు. మీ ఓట్లు ఉన్నవే పిడికెడు, మీ ఓట్లతో డిపాజిట్లు కూడా రావంటూ రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.