ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాలువలో యువతి మృతదేహం లభ్యం కావడంతో విషయం బయటకు వచ్చింది. సదరు యువతి గురువారం రాత్రి భాగవతం వినడానికి వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించి అత్యాచారం చేశారు. ఆమె కాళ్లు చేతులు విరగ్గొట్టి, కళ్లు పీకేసి, మర్మావయవాల్లో వస్తువులు దూర్తి పైశాచికంగా ప్రవర్తించారు. కాలువలో సదరు యువతి మృతదేహం దారుణమైన స్థితిలో లభ్యమైంది. గురువారం రాత్రి యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఫజియాబాద్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అవధేశ్ ప్రసాద్ ఈ ఘటనపై మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. బాధితురాలికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవకి రాజీనామా చేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.