ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నీ బాధితుల గురించి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పవన్ మాట్లాడారు. ఉద్ధానంతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కిడ్నీ బాధితులున్నారని చెప్పారు. జలజీవన్ మిషన్ కు కమిటెడ్ లీడర్ షిప్ కావాలని అభిప్రాయపడ్డారు. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 2027లో జల జీవన్ మిషన్ పూర్తవ్వాలన్నారు. ఈలోపు ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పెద్దావిడ నీళ్లివ్వమని అడిగితే తనకు కన్నీళ్లు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.