ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎంతో చర్చించనున్నట్లు సమాచారం. బియ్యం అక్రమ రవాణాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకుల హస్తం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించే అవకాశం ఉంది.