Site icon

చెస్‌లో సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డి అరుదైన రికార్డు

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌నవ‌డు నారా దేవాన్ష్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. దేవాన్ష్ చెస్‌లో ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్ ను వేగంగా ప‌రిష్క‌రించిన అతి చిన్న వ‌య‌స్కుడిగా తొమ్మిదేళ్ల దేవాన్ష్ రికార్డు సృష్టించాడు. దీంతో ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ వారు దేవాన్ష్‌కు అధికారిక ధృవీకరణ ప‌త్రాన్ని అందించారు. దేవాన్ష్ ఈ ఘనత సాధించడం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ , బ్రాహ్మ‌ణి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Share
Exit mobile version