Site icon

రాజ‌మండ్రి టూ ఢిల్లీ డైరెక్ట్ ఫ్లైట్ షురూ!

రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ల‌నున్న‌ విమాన సర్వీసు నేడు ప్రారంభమైంది. ఈ ఫ్లైట్‌ ఈ రోజు ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ ఫ్లైట్‌లో తొలిసారి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుంచి రాజ‌మండ్రికి వ‌చ్చారు. వీరికి సిబ్బంది ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… విమాన ప్రయాణం విషయంలో పెట్టే డబ్బు కంటే ఆదా అవుతున్న సమయం గురించే ప్రజలు ఎక్కువ‌గా ఆలోచిస్తున్నారని చెప్పారు. రానున్న ఐదేళ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు రాబోతున్న‌ట్లు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యేనాటికి దేశంలో 74 ఎయిర్ పోర్టులు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 158కు పెరిగిందని తెలిపారు.

Share
Exit mobile version