Site icon

పోలీసుల‌కు మ‌రో వీడియో విడుద‌ల చేసిన ఆర్జీవీ

ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తార‌న్న వార్త‌ల‌తో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ప‌రారీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఓ ఫోటో విడుద‌ల చేసి ఆయ‌న కోయంబ‌త్తూర్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఆయ‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం శంషాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చూపించ‌డంతో పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. కాగా, ఆర్జీవీ సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రో వీడియో విడుద‌ల చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదని వీడియోలో స్వ‌యంగా వెల్ల‌డించారు. తాను పోస్టులు పెట్టిన వారికి కాకుండా సంబంధం లేనివారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల గురించి సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఫిర్యాదుతో మ‌ద్దిపాడు పోలీస్ స్టేష‌న్‌లో ఆర్జీవీపై కేసు న‌మోదైంది. విచార‌ణ‌కు రావాల్సిందిగా పోలీసులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు. కాగా, ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డం లేదు.

Share
Exit mobile version