Site icon

ముంద‌స్తు బెయిల్ కోసం హై కోర్టులో ఆర్జీవీ పిటిష‌న్

ఏపీలో ఆర్జీవీపై కేసు విష‌యం ప‌లు ఆస‌క్తిక‌ర మలుపులు తిరుగుతోంది. తాజాగా విచార‌ణ వాయిదా వేయాల‌ని పోలీసుల‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టిన ఆర్జీవీ ఇప్పుడు ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు.ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైంది. కాగా, ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆర్జీవీ పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగ‌నుంది.

Share
Exit mobile version