ఏపీలో ఇటీవల నూతన మద్యం పాలసీ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా కొత్త ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా వచ్చింది. కాగా, రాష్ట్ర తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రూ.99కే మద్యం అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమైనా రూ.99 మద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం పై మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా లిక్కర్ షాపుల్లో తక్కువ ధర మద్యం దొరకడం లేదు. మరో వైపు గత ప్రభత్వ హయాంలో అందుబాటులో లేని బ్రాండ్లు ప్రస్తుతం దొరుకుతుండటంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వార్టర్ బాటిల్ ధర రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.99కే అందిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ మద్యం అన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.