సినీ నటి తమన్నాకు ఈడీ షాకిచ్చింది. ఓ మనీ లాండరింగ్ కేసులో తమన్నాను ఈడీ అధికారులు విచారించారు. బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ పేరిట పలువురిని మోసగించడంలో హెచ్‌పీజడ్ టోకెన్ మొబైల్ యాప్ కీలక పాత్ర పోషించింది. ఈ యాప్ కంపెనీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో తమన్నా పాల్గొంది. దీని కోసం ఆమె కొంత డబ్బు కూడా తీసుకుందని ఈడి తెలిపింది. ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి తమన్నాను విచారించి ఆమె వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అయితే ఆమెపై ఎటువంటి నేరారోపణ అభియోగాలు మోపలేదని, కేసు కూడా నమోదు చేయలేదని ఈడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.