శివరాత్రి వేళ పుణ్య స్నానానికి వెళ్లిన యువకులు గోదావరిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా తాడిపూడి గ్రామానికి చెందిన 11 మంది యువకులు సమీపంలోని గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. అయితే లోతు గమనించకుండా నీళ్లలో దూకే సరికి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వీరంతా 20 ఏళ్ల లోపు వారే. మిగతా వారు క్షేమంగా బయటకు వచ్చారు. కాగా, లోతు గుర్తించకపోవడం వల్లనే యువకులు గల్లంతైనట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.