వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఏపీలో ఎన్నికల అనంతరం ఆ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన వైజాగ్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీకి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పై విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని సూచించారు. ప్రజలు ఐదేళ్ల పరిపాలన కోసం కూటమికి అవకాశం ఇస్తే ఐదు నెలలు కూడా గడవకముందే జగన్ ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్ తీరుతో పార్టీలో ఐదేళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు.