మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ దీక్షా దివస్ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని చెప్పారు. పార్టీ శ్రేణులు,ప్రజలు అధైర్య పడొద్దని అన్నారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలు బాధ పడుతున్నారన్నారు.