Site icon

తెలంగాణ‌లో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ

తెలంగాణ‌లో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ అమ‌లు చేస్తున్నార‌ని మాజీ మంత్రి ,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ నేత‌ల హౌస్ అరెస్టుల‌పై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకు? అని ప్ర‌శ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్ద‌మంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావ‌ని మండిప‌డ్డారు. మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డ పై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడ‌ని విమ‌ర్శించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Share
Exit mobile version