తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై చర్చ పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. నేడు అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు ఈ చర్చను లేవనెత్తారు. ఫార్ములా ఈ కార్ రేస్‌ను అడ్డు పెట్టుకొని, అసత్య ఆరోపణలు చేసి కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ నడుస్తుండగానే ఓ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో స్పీకర్ చాంబర్లో కలిసి విజ్ఞప్తి చేశామని, తాము ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకే ఫార్ములా-ఈ రేస్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సభలో ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.