అసెంబ్లీలో హ‌రీష్‌రావు వ‌ర్సెస్ మంత్రులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. మాజీ మంత్రి హ‌రీష్ రావు, మంత్రుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం వారు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. నేడు అసెంబ్లీలో రోడ్ల అంశంపై చ‌ర్చ జ‌రిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..హరీష్‌రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియద‌ని విమ‌ర్శించారు. ఆయ‌న‌ మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేద‌న్నారు. హ‌రీష్ రావుకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుస‌ని , ఇప్ప‌టికే రూ.10 వేల కోట్లు దోచుకున్నాడ‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత‌ల‌కు రోడ్లు వేయడం చేతకాద‌న్నారు. రూ.ల‌క్ష‌ల కోట్ల ఓఆర్ఆర్ అమ్ముక‌న్నార‌ని, కూలిపోయే ప్రాజెక్టులు కట్టార‌ని విమ‌ర్శించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. స‌భ‌లో వ్యక్తిగత విమర్శలు చేయొద్ద‌ని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పార‌ని, సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాల‌ని సెటైర్లు వేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి త‌న‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాల‌ని డిమాండ్ చేశారు. తాను కమీషన్‌ తీసుకున్నట్టు నిరూపించాల‌ని సవాల్‌ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల‌ని, కొంద‌రు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *