Site icon

టీటీడీ చైర్మ‌న్‌తో మాజీ మంత్రి హ‌రీష్ రావు భేటీ

తెలంగాణ మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడుని క‌లిశారు. ఆయ‌న స్వ‌గృహంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన‌ట్లు ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ మేర‌కు హ‌రీష్ రావు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలందించిన బీఆర్ నాయుడు శ్రీ వేంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్‌గా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై బీఆర్ నాయుడు స్పందిస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవడం గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.

Share
Exit mobile version