Site icon

అమ్మాయిల‌ను కాపాడ‌లేక‌పోతే రాజీనామా చేయండి

ఏపీలో మ‌హిళ‌లు, యువ‌తుల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌పై మాజీ మంత్రి, వైసీపీ మ‌హిళా నేత ఆర్కే రోజా స్పందించారు. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 120 రోజుల్లో 110 ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలో విద్యార్థినికి మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డున్నార‌ని ప్ర‌శ్నించారు. హోం మంత్రి స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని చెప్పి త‌ప్పించుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై ఇన్ని దారుణాలు జ‌రుగుతుంటు మంత్రి నారా లోకేశ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నార‌న్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, మంత్రులు అంద‌తా పాల‌న‌లో విఫ‌ల‌మ‌య్యార‌ని, రాష్ట్రంలో అమ్మాయిల‌ను కాపాడ‌లేక‌పోతే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

Share
Exit mobile version