హైద‌రాబాద్‌లో డ్ర‌గ్ ఇంజ‌క్ష‌న్లు విక్ర‌యిస్తున్న ముఠా అరెస్ట్

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప‌రిస్థితులు మార‌డం లేదు. న‌గరంలో డ్ర‌గ్ క‌ల్చ‌ర్ విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతోంది. త‌ర‌చూ ప‌బ్బులు, హోట‌ళ్ల‌లో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. శుక్ర‌వారం డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే నేడు న‌గ‌రంలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌గ‌ర పోలీసులు శ‌నివారం ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ అమ్ముతున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా హాజీపూర్‌ కేంద్రంగా దేశ వ్యాప్తంగా మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. మత్తు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఏడుగురిని టీన్యాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్‌లోని సుశీలదేవి హాస్పిటల్‌లో పని చేస్తున్న ఓ కెమిస్ట్‌తో కలిసి ఇంజెక్షన్లు తయారు చేస్తున్నారని, సర్వసతి ఎంటర్‌ప్రైజెస్‌, ఫార్మా డిస్ట్రిబ్యూటర్‌ పేరుతో సరఫరా చేస్తున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. పంజాగుట్టకు చెందిన నయీముద్దీన్‌ పాట్నాలోని విజయ్‌కుమార్‌ గుప్తా ద్వారా డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు తెలిపారు.ఈ ముఠా ఇప్ప‌టి వ‌ర‌కు దేశవ్యాప్తంగా 88 లక్షల డ్రగ్‌ ఇంజెక్షన్లు సరఫరా చేసిన‌ట్లు వెల్ల‌డించారు. హైదరాబాద్‌లోనే వెయ్యి వరకు అమ్మారని తెలిపారు. ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌ గుప్తా, నయీముద్దీన్‌తోపాటు ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన మహేశ్‌, లవణ్‌కుమార్‌, సురేశ్‌, మనీశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *