ఏపీలో ఇటీవల టెట్ ఫలితాలు విడుదలతో మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించింది. కానీ ఊహించని విధంగా వాయిదా పడటంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో అత్యధికంగా ఎస్జీటీ 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, హెచ్ఎం 52, పీఈటీ 132 పోస్టులున్నాయి.