Site icon

కొండా సురేఖ‌పై నాగార్జున పిటిష‌న్ విచార‌ణ..

– నాగార్జున వాంగ్మూలం రికార్డు చేయాల‌న్న కోర్ట్

సినీ న‌టులు స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ ఇటీవల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై నాగార్జున నాంప‌ల్లి కోర్టులో క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం కేసు వేశారు. నేడు ఈ కేసుపై న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాల‌ని కోర్టు పేర్కొంది. నాగార్జున‌తో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా న‌మోదు చేయాల‌ని నాగార్జున త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు. అనంత‌రం కోర్టు త‌దుప‌రి విచార‌ణ రేప‌టికి వాయిదా వేసింది. కాగా, కొండా సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌పై న‌టి స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో పాటు ఆమె త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై సినీ న‌టులంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ స్వార్థం కోసం సినీ న‌టుల‌పై విమ‌ర్శ‌లు చేయొద్దంటూ మండిప‌డ్డారు.

Share
Exit mobile version