బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీతో పాటు తెలంగానలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, వాగుల సమీపంలోకి వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో రాబోయే మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.