Site icon

తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షాలు.. టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం

బంగాళా ఖాతంలో అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో ఏపీలోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తిరుమ‌ల‌లో గ‌త రెండు రోజుల నుంచి వ‌ర్షం ఎడ‌తెరిపి లేకుండా ప‌డుతోంది. కొండ చ‌రియ‌లు కూడా విరిప‌డ్డ‌యి. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికలతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భక్తులకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. కొండచరియలు విరిగి ప‌డుతున్న నేప‌థ్యంలో ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం వ‌స్తున్న భక్తులక‌కు దర్శనం, వసతికి ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Share
Exit mobile version