టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ అనంతరం ఈ కేసు విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ప్రస్తుతం వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుతో పాటు పలు కేసులు నమోదయ్యాయి.