ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలి క్యాంటీన్ మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఉన్న వంటశాలలో బుధవారం ఉదయం 3 గంటలకు గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో భారీ పేలుడు జరిగి వంటశాల షెడ్ ధ్వంసమైంది. పేలుడుతో వంటశాలలోని బాయిలర్ 200 అడుగుల మేర ఎగిరిపడినట్టు సమాచారం. షెడ్‌లోని మిగతా వస్తువలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. వంట శాలలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. మరోవైపు ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోంది.