భారత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.ఈ రోజు మధ్యాహ్నం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ లో నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఎయిమ్స్ ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మాధభానందకర్ వెల్లడించారు.