ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు నిరాశే మిగిలింది. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రంప్‌కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా.. అంటూ మోడీ ట్రంప్ ను ప్రస్తావిస్తూ పోస్టు చేశారు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా, మీ చారిత్రాత్మక ఎన్నికల విజయం సందర్బంగా భారతదేశం, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. మన ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, ఇంకా శ్రేయస్సును ప్రోత్సహించడానికి పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.