హైదరాబాద్‌లోని బుచుపల్లిలో నారాయణ కాలేజీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న ఓ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీ యాజమాన్యం విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాళ్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె అనూష బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కొద్ది రోజులుగా ఇంట్లో ఉంటున్న ఆమెను తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రమే కారులో తీసుకొచ్చి హాస్టల్ లో చేర్చి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకోకముందే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. అనూష స్పృహ కోల్పోయిందని సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో హుటాహుటిన వారు తిరుగుపయనమయ్యారు. అక్కడి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పారు. తల్లిదండ్రులు హాస్టల్ కు చేరుకోకముందే బాలిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.