ఏపీలోని ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో యువ నాయకుడు వాకమూడి ఇంద్రను జనసేన పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వాకమూడి ఇంద్ర బర్త్ డే సందర్భంగా రైస్ మిల్లులో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. వాకమూడి ఇంద్ర నిడమర్రు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాకమూడి ఇంద్ర పై పోలీసులు కేసు నమోదు చేశారు.