ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద చంద్రబాబు స్పందన తెలియజేయాలని లేఖలో కోరారు. అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారని, అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని, ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారని వెల్లడించారు. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులైన ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.